జాతీయ రహదారిపై ప్రమాదం

జాతీయ రహదారిపై ప్రమాదం

SRD: ఆరూరు శివారులో జాతీయ రహదారిపై క్వాలిస్ వాహనం లారీని ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాహనంలో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.