VIDEO: ఈ నెల 14 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
విశాఖలోని రుషికొండ శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత వేంకటేశ్వరస్వామి ఆలయంలో నవంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు 14న అంకురార్పణతో మొదలై, 15 నుంచి 17 వరకు హోమాలు, స్నపన తిరుమంజనంతో కొనసాగుతాయి. ఈ కారణంగా ఆ నాలుగు రోజులు దర్శన సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయని ఆలయ ఏఈఓ జగన్‌మోహనా చార్యులు కోరారు.