వడదెబ్బకు గురై ఆటో డ్రైవర్ మృతి

వడదెబ్బకు గురై ఆటో డ్రైవర్ మృతి

BDK: మణుగూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్‌కు చెందిన జి. శంకర్ (38) వడదెబ్బతో రాత్రి మృతి చెందాడు. శంకర్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆటో నడిపి గత రాత్రి ఇంటికి వచ్చాడు. అనంతరం నీరసం చెంది, వాంతులతో బాధపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.