ఉద్యోగాల పేరుతో మోసం.. కేసు నమోదు
KDP: ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల రూపాయలు కాజేసిన గురుకుల పాఠశాల సూపరింటెండెంట్ బెంజిమెన్‌పై చింతకొమ్మదిన్నే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు FIR నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని DHPS నగర కార్యదర్శి యేసురత్నం డిమాండ్ చేశారు. బాధితుల నుంచి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు.