జాతీయ టైక్వాండో ఛాంపియన్‌షిప్ పోస్టర్ ఆవిష్కరణ
అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లి గ్రామంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 1వ జాతీయ టైక్వాండో ఓపెన్ ఛాంపియన్‌షిప్-2026 పోస్టర్‌ను ఆవిష్కరించారు. మే 22 నుంచి 24 వరకు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకునే అవకాశం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.