చింతాలమ్మ ఘాట్ రోడ్డులో ప్రమాదం

చింతాలమ్మ ఘాట్ రోడ్డులో ప్రమాదం

ASR: కొయ్యూరు మండలం చింతాలమ్మ ఘాట్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేంద్రపాలెం వీఆర్వో సత్యనారాయణ, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సత్యనారాయణ, తన కుమారుడుతో కలిసి బైక్‌పై కేడీపేట వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని వాహనదారులు తెలిపారు. గమనించిన వాహనదారులు గాయపడిన ఇద్దరిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.