హఫీజ్‌పేట్లో అధ్వానంగా మారిన రోడ్లు..!
RR: హఫీజ్‌పేట్ అశ్విత ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వీధి లైట్లు లేకపోవడం వల్ల రాత్రివేళ ప్రయాణం ప్రమాదకరంగా మారింది. హఫీజ్‌పేట్ స్టేషన్ వైపు వెళ్లే రోడ్డంతా గోతులతో నిండిపోవడంతో వాహనదారులు ప్రతిరోజూ ప్రమాదాల భయంతో ప్రయాణిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.