డాక్యుమెంట్ రైటర్ లపై విజిలెన్స్ అధికారులు నిఘా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, డాక్యుమెంట్ రైటర్లపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. నకిలీ పత్రాలతో భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే వరంగల్‌లో కొన్ని కార్యాలయాల్లో పరిశీలనలు జరగగా, త్వరలో హనుమకొండలోనూ తనిఖీలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.