ఉప ఎన్నిక ఫలితాలపై స్పందించిన టీపీసీసీ చీఫ్
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. 'జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టబోతున్నారు. మంచి మెజార్టీ రావాల్సి ఉండేది. ఓటింగ్ శాతం తగ్గడం ఫలితాలపై ప్రభావం చూపిస్తుంది' అని అన్నారు. కాగా, మూడు రౌండ్లు ముగిసేసరికి నవీన్ యాదవ్ లీడ్‌లో కొనసాగుతున్నారు.