నేటి సాయంత్రం నుండి 14 ఉదయం వరకు 144 సెక్షన్: సీపీ

NZB: పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ కల్మేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈరోజు సాయంత్రం తర్వాత నిజామాబాదు పార్లమెంటులో ఓటు లేని బయటి ప్రాంతాల వ్యక్తులెవరూ ఉండకూడదన్నారు.