VIDEO: CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్సీ నాగబాబు

KKD: పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు పేర్కొన్నారు. శనివారం పిఠాపురం మండలం కుమారపురం గోకుల్ గ్రాండ్ హోటల్లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నాగబాబు పంపిణీ చేశారు. 24 మంది లబ్ధిదారులకు సుమారుగా 17 లక్షల రూపాయలు చెక్కులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.