రాఘవేంద్ర స్వామి సన్నిధిలో వైస్ ఛాన్సలర్

KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ పి. చంద్రశేఖర్ ఇవాళ దర్శించుకున్నారు. వీరికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను, అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతి వీరికి శేష వస్త్రం జ్ఞాపిక, ఫలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు.