రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలి

రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలి

SKLM: అర్హత కలిగిన రైతులందరికీ సకాలంలో రుణాలు ఇవ్వాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‌గా నియమితులైన శివ్వాల సూర్యనారాయణ (సూర్యం) ఆదివారం రణస్థలంలోని ఎంపీ కార్యాలయంలో కలిశెట్టిని కలిశారు. ఛైర్మన్‌ సూర్యంను ఎంపీ శాలువాతో సత్కరించారు. అర్హులైన రైతులకు కొత్త రుణాలు ఇవ్వడంలో రైతులని ఆదుకోవాలని సూచించారు.