లేఅవుట్‌లలో నిబంధనలు పాటించాలి: కలెక్టర్

లేఅవుట్‌లలో నిబంధనలు పాటించాలి: కలెక్టర్

WNP: కొత్తగా ఏర్పాటుచేసే లేఅవుట్ లలో సమస్యలు తలెత్తకుండా నిబంధనలు పాటిస్తేనే కమిటీ ద్వారా ఆమోదం పొందుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఇవాళ కలెక్టరేట్లో లేఅవుట్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్, కెనాల్, ముంపు, నాలా సమస్యలు లేకుండా, రోడ్లు, ఖాళీ స్థలం, పార్కింగ్ ఉన్న లే అవుట్లను మాత్రమే కమిటీ ఆమోదిస్తుందన్నారు.