ఈ నెల 25 నుంచి పొగాకు కొనుగోళ్లు
ELR: ఎన్ఎల్ఎస్ సరిధిలో వర్జీనియా పొగాకు వేలం కొనుగోళ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నట్లు వేలం నిర్వహణ అధికారి శివకుమార్ తెలిపారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం 1, 2, దేవరపల్లి, గోపాలపురంలోని ఐదు కేంద్రాల్లో వేలం జరుగుతుందన్నారు. సుమారు 4,816 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్న 2,673 మంది రిజిస్టర్డ్ రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని వివరించారు.