కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే
SRD: నియోజకవర్గంలోని పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ ప్రావీణ్యను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న త్రాగునీటి సమస్య, పెండింగ్‌లో ఉన్న రోడ్లకు మరమ్మత్తులు చేయించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికై త్వరగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.