'పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

ATP: కళ్యాణదుర్గంలోని పెన్షనర్ల భవన్‌లో సోమవారం పెన్షనర్ల సమస్యలపై సమావేశం నిర్వహించారు. పెన్షనర్ల సంఘ ప్రధాన కార్యదర్శి తిప్పేస్వామి మాట్లాడుతూ.. 6 నెలలుగా మట్టి ఖర్చులకు నిధులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. బకాయి ఉన్న కరువు భత్యం వెంటనే విడుదల చేయాలని కోరారు.