ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ
శ్రీకాకుళం నగర ప్రజలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిల పై ఉన్న వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ రాయితీని పొందాలనుకునే వారు మార్చి 31 లోపు తమ అసల పన్ను బకాయిలతో పాటు, మిగిలిన 50 శాతం వడ్డీని ఏకకాలంలో చెల్లించాలని సూచించారు.