శామీర్‌పేటలో ఎథనాల్ ట్యాంకర్ బోల్తా

శామీర్‌పేటలో ఎథనాల్ ట్యాంకర్ బోల్తా

జనగామ మండలం శామీర్‌పేటలోని ఎథనాల్ ట్యాంకర్ బోల్తా పడింది. శుక్రవారం రాయపూర్ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎథనాల్ లీకేజీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.