కొండగట్టులో లైవ్ సమీక్షిస్తున్న కలెక్టర్
JGL: కొండగట్టులో జరుగుతున్న చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలను కలెక్టర్ సత్యప్రసాద్ ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి ఆయన ఆలయ పరిసరాలను, భక్తుల మాల విరమణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, క్యూలైన్ల నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.