ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నాం: మంత్రి

KRNL: ఎన్నికల్లో హామీ మేరకు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించామని మంత్రి టీజీ భరత్ అన్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20వేలకు పెంచి విడుదల చేశామని మంత్రి ఒక ప్రకటన తెలిపారు. 2014లో తొలిసారిగా టీడీపీ ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భృతిని ప్రవేశ పెట్టిందని తెలిపారు. ప్రభుత్వం రాకతో దశ మారిందన్నారు.