ఎక్కువ ధర వసూలు చేస్తే కఠిన చర్యలు: జేసీ

CTR: ప్రభుత్వం నిర్దేశించిన సిలిండర్ ధర కంటే వినియోగదారుల నుండి ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ సమావేశం హాల్ వద్ద జిల్లా పౌర సరఫరాల అధికారి శంఖరన్‌తో కలిసి జిల్లాలోని గ్యాస్ ఏజన్సీల డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.