సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
PLD: దుర్గి మండలం అడిగొప్పలలోని శ్రీ లక్ష్మీనరసింహ కాటన్ జిన్నింగ్ మిల్ ప్రాంగణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ (పత్తి కొనుగోలు కేంద్రం)ను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలును సమయానికి ప్రారంభించిందని తెలిపారు.