సోమశిల ఆప్రాన్ పనుల్లో తీవ్ర జాప్యం

సోమశిల ఆప్రాన్ పనుల్లో తీవ్ర జాప్యం

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం ఆప్రాన్ పనులు 2021 వరదల్లో దెబ్బతిన్నా ఇప్పటికీ పూర్తికాలేదు. నిధుల కొరత, అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రాజెక్టు వద్ద రక్షణ చర్యలకు సిబ్బంది కూడా లేరు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షిస్తున్నా కూడా పనుల్లో పురోగతి లేదని, 8 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టుపై నిర్లక్ష్యం తగదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.