'రౌడీషీటర్లు నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి'
KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని సీ.బెలగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఎస్సై వేణుగోపాల్ రాజు నేర నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. నేర ప్రవృత్తిని విడనాడి, చట్టానికి లోబడి సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.