అందుకు గర్వంగా ఉంది: మంచు విష్ణు

అందుకు గర్వంగా ఉంది: మంచు విష్ణు

మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తున్న 'కన్నప్ప' సినిమా జూన్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ నెల 8న న్యూజెర్సీ, 9న డల్లాస్, 10న బే ఏరియాలో ప్రమోషన్స్ చేయనున్నారు. ఈ క్రమంలో విష్ణు ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసే అవకాశం చాలాకాలం తర్వాత 'కన్నప్ప'తో లభించినట్లు తెలిపాడు. ఈ మేరకు సంబంధిత గ్లింప్స్ విడుదల చేశాడు.