'గ్రామాల్లో గొలుసు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు'

'గ్రామాల్లో గొలుసు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు'

PPM: నాటు సారా అమ్మినా, గొలుసు దుకాణాలు నిర్వహించిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. శిరీష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కొమరాడ మండలం శివుని, విక్రంపురం గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. తనిఖీల్లో ఎటువంటి గొలుసు దుకాణాలు, నాటుసారా అమ్మకాలు తమ దృష్టికి రాలేదని ఆమె స్పష్టం చేశారు.