'ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలి'

VZM: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలు చెల్లించాలని APTF అకాడమిక్ రాష్ట్ర కన్వీనర్ జేసీ రాజు మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు బొబ్బిలిలో నిర్వహించిన సమావేశంలో జేసీ రాజు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు 23 వేల కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. బోధనేతర పనులు నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు.