పిచ్చి కుక్క దాడిలో వ్యక్తికి గాయాలు

పిచ్చి కుక్క దాడిలో వ్యక్తికి గాయాలు

NLR: మనుబోలులో పిచ్చి కుక్క కాటుకు ఓ యువకుడికి గాయాలయ్యాయి. బీసీ కాలనీకి చెందిన ఇమ్మిడిశెట్టి వేణు అనే యువకుడిని పిచ్చి కుక్క కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ అతనికి మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. బుధవారం మనుబోలులో ఐదుగురు కుక్క కాటుకు గురయ్యారని స్థానికులు తెలియజేశారు.