ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా శ్రీకాకుళం వాసి

ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా శ్రీకాకుళం వాసి

SKLM: ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా తుహిన్ కుమార్ గేదెల సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కత్తుల కవిటి గ్రామానికి చెందిన తుహిన్ కుమార్ 1994లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. వివిధ హోదాల్లో సేవలందించారు. ఆయనతో కలిసి ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.