అక్రమ రేషన్ బియాన్ని పట్టుకున్న ఎమ్మెల్యే
AKP: జిల్లాలో రోజురోజుకు రేషన్ బియ్యం అక్రమ రవాణా పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఇవాళ ఎలమంచిలి పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 3,000 కిలోల రేషన్ బియ్యాన్ని స్థానిక ఎమ్మెల్యే సుందర్ విజయకుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అనంతరం పట్టుబడ్డ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.