VIDEO: అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి

VIDEO: అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి

BHNG: వలిగొండ మండలం ఏదుల్లగూడెం, టేకులసోమారం మధ్య ఆటో డ్రైవర్ సందెల శివ(38) అనుమానాస్పద స్థితితో సోమవారం మృతిచెందాడు. అతని మృతదేహం రోడ్డు పక్కన పడి ఉంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం కిరాయి ఉందని ఆటో తీసుకొని వెళ్లాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చివరికి టేకులసోమారం మధ్యలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.