'పెరుగుతున్న వరద.. అప్రమత్తంగా ఉండాలి'

'పెరుగుతున్న వరద.. అప్రమత్తంగా ఉండాలి'

కృష్ణా: ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతుందని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ హెచ్చరించారు. ప్రస్తుతం 2.87 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా సోమవారానికి 3.97 లక్షలకు పెరిగే అవకాశముందని తెలిపారు. వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, రహదారుల దెబ్బతీతలకు తక్షణ మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు.