'బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే చర్యలు తప్పవు'
SDPT: జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య పాఠశాలకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ రూ.25 వేల జరిమానా విధించారు. పాఠశాల నిర్మాణ వ్యర్థాలు, మురుగునీటిని బహిరంగ ప్రదేశంలో వేసినందుకు ఈ జరిమానా విధించారు. అనంతరం కోమటి చెరువును సందర్శించి, అభివృద్ధి పనులను పరిశీలించారు. చెరువు నాలా కంచె మీదుగా చెత్త విసిరేస్తున్న ఓ యువకుడికి రూ.1500 జరిమానా విధించారు.