భారీ వర్షం.. విరిగిపడిన చెట్టు

భారీ వర్షం.. విరిగిపడిన చెట్టు

రంగారెడ్డి: భారీ వర్షం కారణంగా బీఎన్ రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని SKDనగర్‌లో గురువారం రాత్రి చెట్టు విరిగింది. దీంతో కాలనీవాసులు కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డికి సమాచారం అందించారు. స్పందించిన కార్పొరేటర్ వెంటనే సంబంధిత హైడ్రా సిబ్బందితో కలిసి ఘటనస్థలానికి చేరుకొని విరిగిపడిన చెట్టును తొలగించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కార్పొరేటర్ సూచించారు.