'ఇతన్ని చూస్తే చెప్పండి.. చిక్కితే అప్పగించండి'

'ఇతన్ని చూస్తే చెప్పండి.. చిక్కితే అప్పగించండి'

SKLM: జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అనేక దొంగతనం కేసుల్లో నిందితుడైన దున్న కృష్ణను పోలీసులు మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించారు. శనివారం అతని ముఖ చిత్రాన్ని విడుదల చేసి వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం కోల్‌కతాలో నివాసముంటున్న కృష్ణ తెలుగుతో పాటు పలు భాషలు మాట్లాడతాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని డీఎస్పీ సి.హెచ్ వివేకానంద తెలిపారు.