తేలికపాటి ఓ మోస్తరు వర్షం.. చల్లబడిన వాతావరణం

SRD: కంగ్టి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం తేలికపాటి వర్షం కురిసింది. గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశమంత నల్లటి మబ్బులు కమ్ముకొచ్చి తేలికపాటి ఓ మోస్తరు వర్షం కురిసింది. దాంతో వాతావరణం చల్లబడింది. ఎండ వేడిమి నుంచి ప్రజలు చల్లదనంతో ఉపశమనం పొందారు. అయితే అకాల వర్షంతో రబీ రైతులు ఆందోళన చెందుతున్నారు.