రైతన్న మీకోసం కార్యక్రమంలో కలెక్టర్
NTR: పెనుగంచిప్రోలు మండలం శనగపాడు రైతుసేవ కేంద్రంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మిశ పాల్గొన్నారు. సమాజంలో నేడు మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతులను మార్చుకోవాలని కోరారు. చిరుధాన్యాల సాగుతో పాటు ఉద్యాన పంటలపైనా దృష్టిసారించాలన్నారు. సాగుకు సాంకేతికత తోడైతే తిరుగుండదని పేర్కొన్నారు.