వేటపాలెంలో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం
బాపట్ల: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో వేటపాలెంలోని సర్వోదయ కాలనీలో వెంకటరత్నం, సుబ్బులు అనే బలహీన వర్గాల మహిళలను సత్కరించారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ పిల్లల ఎదుగుదల కోసం కృషి చేస్తున్న మహిళలను ప్రోత్సహించడమే కార్యక్రమం ఉద్దేశమని సంఘం అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు తెలిపారు.