విద్యార్థులకు.. ఎండలో విద్యాభ్యాసం..!
PPM: పాచిపెంట మండలం గొట్టూరు గ్రామంలోని పాఠశాల భవనం స్లాబ్ లేకపోవడంతో విద్యార్థులు ఎండలోనే తరగతులు కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితిని బుధవారం పరిశీలించిన సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కోరాడ ఈశ్వరరావు, వెంటనే స్లాబ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పలుమార్లు వినతులు ఇచ్చినా అధికారులు స్పందించకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.