పెన్షన్ దారుల వివరాలను పరిశీలించిన అధికారులు

పెన్షన్ దారుల వివరాలను పరిశీలించిన అధికారులు

MNCL: దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేయూత పెన్షన్ దారులకు, దివ్యాంగుల వివరాలలో సవరణల కోసం ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం జన్నారం, దండేపల్లి, హాజీపూర్ మండలాలకు చెందిన పెన్షన్ దారులు దివ్యాంగులు ఈ శిబిరానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, ఆధార్ వివరాలను పరిశీలించారు.