స్వీయ గణనపై అవగాహన ర్యాలీ
VZM: జనాభా లెక్కల ప్రత్యేక క్యాంపెయిన్‌లో భాగంగా ఈ నెల 26న 'స్వీయ గణన'పై 5కే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీఆర్వో సత్తిబాబు తెలిపారు. బుధవారం తన ఛాంబర్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ ర్యాలీ ఉదయం 7 గంటలకు అమ్మవారి గుడి వద్ద ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జనాభా సేకరణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు.