టీడీపీ సీనియర్ నేతను కోల్పోయింది: ఎమ్మెల్యే పుత్తా

టీడీపీ సీనియర్ నేతను కోల్పోయింది: ఎమ్మెల్యే పుత్తా

KDP: టీడీపీ సీనియర్ నాయకుడిని కోల్పోయిందని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ఆకస్మిక మృతి నేపథ్యంలో రాయచోటిలోని ఆయన నివాసంలో పార్థివ దేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటని స్పష్టం చేశారు.