నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని DE రాజన్న ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వినియోగదారులు గమనించాలని కోరారు.