అంగన్వాడి చిన్నారులకు యూనిఫామ్‌లు పంపిణీ
MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని అంగన్వాడి 3వ సెంటర్‌లో చిన్నారులకు ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. చిన్నారుల విద్యా, ఆరోగ్య అభివృద్ధికి అంగన్వాడి కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడి కేంద్రాలను మరింత బలపెతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.