యూరియా కోసం నిరసన వ్యక్తం చేసిన రైతులు

MDK: నిజాంపేట, కల్వకుంటలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. సొసైటీకి 440 బస్తాల యూరియా లోడు ఆదివారం రావడంతో రైతులు భారీగా క్యూ లైన్లలో నిలబడ్డారు. వారం రోజులుగా ఎదురుచూస్తున్న తమకు ఒక లోడు సరిపోదని, ఒక బస్తా మాత్రమే ఇస్తే ఎలా సరిపోతుందని రైతులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఒక్కో రైతుకు ఒక బస్తా అందించగా, రైతులు నిరసన వ్యక్తం చేశారు.