సౌదీలో గంభీరావుపేట వాసి మృతి
సిరిసిల్ల: సౌదీ అరేబియా దేశంలో గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ వాసి మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గడ్డం రాజయ్య గత కొన్ని సంవత్సరాలుగా బ్రతుకుతెరువు కోసం సౌదీ అరేబియా దేశానికి వెళ్ళాడు. సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. తన తోటి మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.