పరిసరాల పరిశుభ్రతపై అవగాహన

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన

NLR: అల్లూరు పట్టణంలోని ఆర్డీఆర్ ప్రాంతం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పిల్లలకు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పిల్లలకు తెలియజేశారు. ఆహారం తినకముందు కచ్చితంగా చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు సౌజన్య, పద్మావతి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.