రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
ELR: చింతలపూడి మండలం వెలగలపల్లి గ్రామ శివారు ఏలూరు మెయిన్ రోడ్డు మరమ్మతు పనులు శనివారం స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పరిశీలించారు. రోడ్డు మరమ్మతు పనులలో అలసత్వం వహించవద్దని, త్వరితగతన మరమ్మతు పనులు నాణ్యత లోపం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా రహదారిని పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు.