VIDEO: మానవత్వం చాటుకున్న సీఐ ప్రశాంత్ కుమార్
కోనసీమ: అమలాపురం రూరల్ సమనస గ్రామం వద్ద శనివారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సీఐ ప్రశాంత్ కుమార్ సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. విధి నిర్వహణలో ఉండగా సమనస వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సీఐ గమనించారు. గాయపడిన వ్యక్తిని వెంటనే తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించి, వైద్యం అందేలా చేశారు.